గార్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనుక గల మంగపతి కాలనీలో చిన్నారులంతా ఏకమై ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. దీంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో కృష్ణ భగవాన్ కి పూజలు నిర్వహించి ఉత్సాహంగా చిన్నారులు ఉట్టిని కొట్టారు అనంతరం ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ”కృష్ణాష్టమి”గా వేడుక చేసుకుంటామని, శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా పేర్కొన్నారు. కృష్ణాష్టమిని “గోకులాష్టమి”, “అష్టమి రోహిణి”, “శ్రీకృష్ణ జన్మాష్టమి”, “శ్రీకృష్ణ జయంతి”, “శ్రీ జయంతి”, “సాతం ఆతం”, “జన్మాష్టమి” – ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారని తెలిపారు. చిన్నారులకు వేసిన కృష్ణుని, గోపికలు వేషధారణలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఆయా, చిన్నారులు పాల్గొన్నారు.