కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చేపట్టబోయే కార్యాచరణను ఆవిష్కరించే సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత నిరుద్యోగ గర్జన సభకు తరలిరావాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోలుగురి సదయ్య పిలుపునిచ్చారు. ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి బల్మూరి వెంకట్ ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మొలుగురి సదయ్య మాట్లాడుతూ నీళ్ళు,నిధులు, నియామకాలలో జరిగే అన్యాయాన్ని సహించలేక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగింది తప్ప వంట వార్పు,ధూమ్ దాం కార్యక్రమాలతో కొట్లాడి తెచ్చుకున్న ప్రజలకు నిరుద్యోగులకు యువతకు 8 ఏండ్లుగా సరియైన ఉద్యోగ నోటిఫికేషన్ల ఇవ్వక నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడుతు ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రశ్న పత్రాలను లక్షలకు అమ్ముకుని నిరుద్యోగులు ఉసురు తీయటాన్ని ఖండిస్తూ కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ కు బరోసా కల్పించడానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం లో జరిగే నిరుద్యోగ గర్జన సభకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఆ సభలో యుత్ డిక్లరేషన్ ను ప్రకటించిన నేపథ్యంలో ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల పరిధిలోని విద్యార్థులు, నిరుద్యగులు, యువత అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం సభా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ, గుడేపు ఓదెలు, శనిగారపు రాము, మర్రి వీరరెడ్డి, మంకు ఐలయ్య, అన్నరపు సాయి, విజేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు మారపల్లి వంశీ, పెద్ది శివ, గుండారపు సాయి, జీల్లేల సందీప్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.