Saturday, April 12, 2025
HomeతెలంగాణRasamai: పర్లపల్లి సర్పంచ్ ని సన్మానించిన ఎమ్మెల్యే

Rasamai: పర్లపల్లి సర్పంచ్ ని సన్మానించిన ఎమ్మెల్యే

సర్పంచ్ మాదాడి భారతిని సన్మానించిన ఎమ్మెల్యే

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇటీవల కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామ పంచాయితీకి  పచ్చదనం, పరిశుభ్రత,  సాలీడ్  ప్లాస్టిక్  వేస్ట్ మేనేజ్ మెంట్ విభాగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీగా అవార్డును సాధించింది. అదే విధంగా అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో  ఐఎస్ఓ-9001 సర్టిఫికెట్ కూడా పొందింది. ఈ  సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన పర్లపల్లి గ్రామ సర్పంచ్ మాదాడి భారతి-నర్సింహారెడ్డి ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ఘనంగా సన్మానించి, గ్రామ పంచాయితీ పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ ఎల్ పి కార్యదర్శి  మాదాడి రమేష్ రెడ్డి, ఎంపీటీసీ సంప త్ రెడ్డి, ఉప సర్పంచ్  సుద్దాల రాజేష్, వార్డు సభ్యులు గుమ్మడి రాజు, శనివారపు యాదగిరి, కామల్ల సర వ్వ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News