Friday, December 27, 2024
HomeతెలంగాణMallapur: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

Mallapur: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

కాంగ్రెస్ లో నయా జోష్

మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తో కలసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజిత్ రావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, సీఎం, మంత్రులు నిరంతరాయంగా పని చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.
ప్రజలు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు బూటకపు మాటలు మాట్లాడటం మానేయాలని అన్నారు.
పార్టీ పేరు చెప్పుకొని కొందరు నాయకులు ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, ప్రజలకు అందుబాటులో మండల అధ్యక్షుడు, నాయకులు ఎల్లవేళలా ఉంటారనీ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి గెలుపే లక్ష్యంగా నాయకులు పనిచేస్తారు.

- Advertisement -

అన్ని ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తం అని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ
మండల అధ్యక్షులు కొమ్ముల. చిన్నారెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు ఆడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు, టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆద్వర్యంలో
కార్యాలయ ప్రారంభం చేయడం చాలా సంతోషం అని రాబోయే రోజుల్లో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యత తీసుకుంటామని, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తామని, మండల అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తానని అన్నారు.
ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి మాట్లాడుతు రాబోయే స్థానిక ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్ జెండా ఎగురేస్తమని, రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నది మా ప్రభుత్వమని, ప్రజల సమస్యల పరిష్కారానికి, మండల అభివృద్ధికికృషి చేస్తామని, కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ నీ పరువూ తీస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు.

కార్యక్రమంలో మెట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ కూన. గోవర్ధన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నిమ్మల. రాజు, ఫీషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త. నారాయణ, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దామెర. రాజ శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News