Saturday, October 5, 2024
HomeతెలంగాణNekkonda : విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరి ముక్క

Nekkonda : విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరి ముక్క

చిన్నపిల్లలు ఏడుస్తుంటే.. వాళ్లకి చాక్లెట్టో, బిస్కెట్టో లేదా ఆట వస్తువో ఇచ్చి ఊరుకోబెట్టడం సహజం. అలా ఓ చిన్నారి ఏడుస్తుండగా.. సముదాయించేందుకు తల్లి కొబ్బరిముక్క ఇచ్చింది. అది గొంతుకకి అడ్డంపడి ఆ చిన్నారి చనిపోయాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నెక్కొండ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అయ్యప్పమాల ధరించిన తండ్రి మాలు.. ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ దేవుడికి కొబ్బరికాయలు కొట్టేవారు.

- Advertisement -

ఆదివారం (డిసెంబర్ 4) తెల్లవారుజామున తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. మణికంఠ అనే 10 నెలల చిన్నారి ఏడవడం మొదలుపెట్టాడు. బిడ్డ ఏడుపు మానిపించేందుకు.. తల్లికవిత ఇంట్లో ఉన్న కొబ్బరిముక్కను చేతికిచ్చింది. సరిగ్గా పళ్లు కూడా రానీ ఆ చిన్నారి కొబ్బరి ముక్కను మింగేశాడు. దాంతో అది గొంతుకకు అడ్డంపడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించింది. వెంటనే తల్లిదండ్రులు మాలు-కవిత చిన్నారిని తీసుకుని ఆస్పత్రికి బయల్దేరగా మార్గమధ్యంలోనే చిన్నారి కన్నుమూశాడు. బిడ్డ మరణంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నపిల్లలకు అలాంటి ఘనపదార్థాలను తినేందుకు ఇవ్వకూడదని, ఇస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News