స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
- Advertisement -
2.ట్రాన్స్‌జెండర్ల విషయంలో ఇంతటి కీలకమైన అడుగు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు..
- ఇది పాలనలో సృజనాత్మకమైన ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ – రెండు కీలకమైన సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నం.. (ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పన, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం)
- భారతదేశంలోని అయిదు పెద్ద నగరాల్లో హైదరాబాద్‌లోనే అతి తక్కువ ట్రాఫిక్ జామ్ సమస్య ఉంది. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యతో ఈ సమస్య మరింతగా తగ్గి ట్రాఫిక్ తగ్గింపునకు ఉత్తమ ఉదాహరణగా మారేందుకు దోహదపడుతుంది.
- ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు, నియామకం, శిక్షణ తర్వాత, ఈ ట్రాన్స్‌జెండర్ బృందాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలుస్తారు.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ప్రగతిశీలక చర్య ఆడ, మగా, ట్రాన్స్‌జెండర్ అనే వివక్ష లేదనేందుకు అత్యుత్తమ ఉదాహారణగా నిలుస్తోంది.