ప్రతి ఒక్కరు మహాగణపతి పూజను ఆచరించాలని సకల సమస్యలనుండి విముక్తి పొందాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. వనజ నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో మహాగణపతికి వేదమంత్రోత్సరణల మధ్య అత్యంత వైభవోపేతంగా మహానైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ మహాగణపతికి పూజ చేయడం పూర్వజన్మసుకృతమని చాలా మహిమన్వితమైనదని తెలుపుతూ ప్రతి ఒక్కరూ వినాయకుని పూజల గూర్చి విధిగా తెలుసుకోవాలని, స్వామి వారి సేవలో తరించాలని కోరారు. తల్లిదండ్రుల పట్ల అనురాగాలకు, సోదరుల పట్ల చూపించేటువంటి వాత్సాల్యానికి ప్రతీక వినాయకుడని చెప్పారు. స్వామి వారి నవరాత్రోత్సవాలను దేశ విదేశాలలో చాలా అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్వామి వారి సేవలలో పాల్గొనడం ద్వారా భక్తి భావాలు పెరుగుతాయని వారి నవరాత్రోత్సవాలలో వివిధ రకరకాల పుష్పాలతో, ఫలాలతో, ఫలపంచామృతాలతో అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పాపవిముక్తిని పొందడమే కాకుండా సుఖసంతోషాలను శుభఫలాలను పొందుతామని అన్నారు. నవరాత్రోత్సవాలలో భాగంగా విద్యాసంస్థల్లో స్వామివారికి అత్యంత విశిష్టమైన 108 ప్రసాదాలతో మహానైవేద్యాన్ని సమర్పించామన్నారు. స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. సమర్పణలో భాగంగా స్వామి వారి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారని ఫలవంచామృతాలతో దేదిపమాన్యంగా అభిషేకం అభిషక కాలంలో చేసిన భజనలు భక్తిపారవశ్యాన్ని పెంపొదించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.