Thursday, April 3, 2025
Homeతెలంగాణ21st Century IAS academy: తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించండి ఇలా..

21st Century IAS academy: తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించండి ఇలా..

కృష్ణ ప్రదీప్..

“తొలి ప్రయత్నంలో సివిల్ సర్వీసులు ఎలా సాధించాలి ” అనే అంశంపై జీ5 మీడియా గ్రూప్, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేటలో సెమినార్ నిర్వహించారు.

- Advertisement -

21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ..దేశ నిర్మాణంలో నాయకత్వ లక్షణాలు ఎంతో ముఖ్యమని, ఒక నిజమైన నాయకుడు కేవలం ఒక విభాగానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని చెప్పారు. ఐఏఎస్ అధికారి సంజయ్ జార్జ్ గురించి ఉదాహరణగా చెప్తూ, ఆయన దేశానికి చేసిన సేవలు, అద్భుతమైన నాయకత్వ లక్షణాలను విద్యార్థులకు వివరించారు.

రాబోయే తరానికి ఉత్తమైన లక్షణాలు ఉన్న నాయకులను తయారు చేయడం తమ అకాడమీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కృష్ణ ప్రదీప్ అన్నారు.

21st సెంచరీ అకాడమీ చీఫ్ మెంటర్ డా. భవాని శంకర్ యు.పి.ఎస్.సి. పరీక్షా ప్రక్రియను విద్యార్థులకు వివరిస్తూ సివిల్ సర్వెంట్లుగా ఉండటం ద్వారా వారు ముఖ్యమైన సమస్యల పరిష్కారకర్తలు, సానుకూల సామాజిక మార్పు తీసుకురావడానికి పాత్ర పోషించగలరని చెప్పారు. ఎం.జి.ఐ.టి. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సివిల్ సర్వీసులో ఉన్న వారిలో 10 మందిలో 6 మంది ఇంజినీరింగ్ విద్యార్థులుగా ఉన్నారని, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

డా. రాజి రెడ్డి, డా. రవిచంద్ర . గిరి ప్రకాష్, ఇతర అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News