Saturday, November 23, 2024
HomeతెలంగాణFarmers loan waiver: 31,000 కోట్లతో రుణమాఫీ, రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘం

Farmers loan waiver: 31,000 కోట్లతో రుణమాఫీ, రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘం

రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు?

వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని వివరించిన సీఎం రేవంత్, మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే అన్నారు. రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు సీఎం వివరించారు. గతేడాది డిసెంబర్ 9 ఇందుకు కటాఫ్ తేదీ అని తెలిపారు.

- Advertisement -

మాది శిలా శాసనమే..

కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనమని, ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ.28వేల కోట్లు, గత ప్రభుత్వం 11డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం 12డిసెంబర్ 2018 నుంచి 9డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించిందని రేవంత్ వివరించారు. రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరమవుతోందన్నారు.

8 నెలల్లోనే ఇచ్చిన మాట కోసం..

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించిందని, గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని, రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయన్నారు. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోందన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వీరే..

అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించామన్నారు. జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు. ఈ నివేదికను శాసనసభలో పవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామన్నారు. మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారన్నారు రేవంత్. వీరిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారమన్నారు. సమచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలని, రుణమాఫీపై తినబోతూ రుచులెందుకని రేవంత్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

శషబిషలు అవసరం లేదు..

రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదని రేవంత్ భరోసా ఇచ్చారు. నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్నీ పొందుపరుస్తామన్నారు సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News