Friday, April 11, 2025
HomeతెలంగాణKorukanti Chander: బిఆర్ఎస్ గా మనమే గెలుస్తాం

Korukanti Chander: బిఆర్ఎస్ గా మనమే గెలుస్తాం

అపోహలు వద్దు

రామగుండం నియోజక వర్గంలో తప్పకుండా మనమే గెలుస్తాం, ఎలాంటి అపోహలు చెందవద్దని ఎమ్మెల్యే చందర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని క్వార్టర్స్ లో పార్టీ శ్రేణులతో కలిసి రాబోయే ఎన్నికలపై సమీక్షించారు. పార్టీలో పనిచేసే వారందరూ రాబోయే ఎన్నికల కోసమే పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే గెలుపు కోసం చేస్తే రానున్న సర్పంచ్, కార్పొరేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యంగా ప్రతిపక్షాల వారు ఇష్టానుసారంగా మాట్లాడితే స్పందించండని తెలిపారు. BRS ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనల్ని గెలుపిస్తాయన్నారు. షాది ముబారక్, కల్యాణ లక్ష్మి, పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా, దళిత బందు తదితర పథకాలు ప్రజలకు చేరాయన్నారు. నా గెలుపు మీరే.. గెలుపు కోసం ముందుకు సాగండి.. ఇక ప్రజల్లోకి వెలుదాం.. సహకరించండి అంటూ కార్పొరేటర్లకు, బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నురి సతీష్, మేకల సదానందం, పాముకుంట్ల భాస్కర్, పెంట రాజేష్, పులేందర్, కుమ్మరి శ్రీనివాస్, దొంత శ్రీను, కొమ్ము వేణు, జడ్పీటిసి అములా నారాయణ, నాయకులు చల్లా రవీందర్ రెడ్డి, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, నిరటి శ్రీను, వేణు, శ్రీనివాస్, శంకర్, సతీశ్ గౌడ్, నాగరాజు, శ్రీనివాస్, బాను, మణికంఠ, తిరుపతి నాయక్, పర్లపల్లి రవి, జేవి రాజు తదితరులు పాల్గన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News