Saturday, November 15, 2025
HomeతెలంగాణSchool Bus Accident: స్కూలు బస్సు కింద పడి నాలుగేళ్ల బాలిక మృతి

School Bus Accident: స్కూలు బస్సు కింద పడి నాలుగేళ్ల బాలిక మృతి

School Bus Accident: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు కిందపడి ఎల్‌కేజీ చదువుతున్ననాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ పాఠశాల ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మృతిచెందిన బాలికను జస్మిత (4)గా గుర్తించారు. బస్సును డ్రైవర్‌ రివర్స్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన చిన్నారిని పాఠశాల సిబ్బంది స్తానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. పాప అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

- Advertisement -

డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి జస్విత చనిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనకు కారణమైన నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ విజయ్‌ను అరెస్టు తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad