తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా మరో 65 జబ్బులకు చికిత్స అందించాలని నిర్ణయము తీసుకుంది. యాంజియేగ్రామ్, పార్కిన్ సన్, వెన్నముకకు సంబధించిన అధునాతన చికిత్సా విధానాలను ఈ పథకంలో చేర్చింది.
- Advertisement -
వైద్య నిపుణుల సూచనతో ప్రస్తుత ప్యాకేజీలో ఉన్న 1.375 విధానాల ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ 497.29 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.