Sunday, April 6, 2025
HomeతెలంగాణMaoists: భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

Maoists: భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో(86 మంది) మావోయిస్టులు(Maoists) పోలీసుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసు బెటాలియన్‌ కార్యాలయంలో కొత్తగూడెం మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి సమక్షంలో వీరంతా లొంగిపోయారు. వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు, 66 మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా 25 వేల రూపాయల చెక్కును చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ‘ఆపరేషన్‌ చేయూత’ కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. మావోయిస్టులు అజ్ఞాత జీవితాన్ని విడిచి సాధారణ జీవితంలోకి రావాలని కోరారు. ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News