కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendra Reddy)కి తెలంగాణ హైకోర్టు(TG High Court)లో ఊరట లభించింది. లగచర్ల దాడి ఘటన (Lagacharla Incident)లో బొంరాస్ పేట పోలీసులు నరేందర్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్(FIR)లు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని వాదించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈనెల 25న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా నేడు తీర్పు వెలువరించింది.
కాగా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి వెనక పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ పోలీసులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.