Tuesday, December 31, 2024
HomeతెలంగాణYadagirigutta: యాదగిరిగుట్టలో గ్రిల్స్‌ మధ్య ఇరుక్కున్న బాలుడి తల

Yadagirigutta: యాదగిరిగుట్టలో గ్రిల్స్‌ మధ్య ఇరుక్కున్న బాలుడి తల

యాదగిరిగుట్ట(Yadagirigutta) ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనకం కోసం హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. స్వామి వారి దర్శనం కోసం రూ.150 టికెట్ క్యూలైన్‌లో ప్రవేశించారు. అయితే వారి కుమారుడు దయాకర్ అనే బాలుడు తన తలను తెలియకుండా గ్రిల్స్ మధ్యలో పెట్టాడు. దీంతో ఆ బాలుడి తల అందులో ఇరుక్కుపోయింది. గమనించిన తోటి భక్తులు గ్రిల్ నుంచి బాలుడి తలను చాకచక్యంగా బయటకు తీశారు. బాలుడికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

బాలుడి తలను గ్రిల్‌లో నుంచి బయటకు తీయడానికి తోటి భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. తలను పైకి కిందకు జరుపుతూ బయటకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్పందించిన ఆలయ అధికారులు పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News