Thursday, January 15, 2026
HomeతెలంగాణFire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

- Advertisement -

Fire Accident: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో చెలరేగిన మంటలు ఏకంగా 6 గురిని బలితీసుకున్నాయి. కుటుంబ యజమానితో సహా ఐదుగురు సభ్యులు ఈ మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ లో జరిగింది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో శివయ్య (50), ఆయన భార్య పద్మ (45), పద్మ అక్క కూతురు మౌనిక (23), మౌనిక ఇద్దరు కుమార్తెలతో పాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య కూడా మృతి చెందారు.

ఇంటి మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేసి.. సహాయక చర్యలు చేపట్టారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లో ఉన్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదానికి కారణాలను డీసీపీ అఖిల్ మహాజన్ దర్యాప్తు చేస్తున్నారు.

అగ్ని ప్రమాదంపై ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అవడం తమని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News