Chinneti Vaagu: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో, మూసీ నదికి వరద పోటెత్తింది. దిగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. యాదాద్రి జిల్లాలో మూసీ నది అనుబంధంగా ఉన్న వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతితో లో లెవెల్ బ్రిడ్జిలపై వరద ఉదృతంగా నీరు ప్రవహిస్తుంది. ప్రయాణం ప్రమాదంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ.. వరద ఉదృతిని తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది. ఆమె వెనకాలే 23 ఏళ్ల యువకుడు వరద దాటే ప్రయత్నం చేశాడు. సునాయాసంగా ఆమె వాగును దాటి వెళ్లగా.. అతడు మాత్రం వరద అంచనా వేయలేక బలైపోయాడు. వరద ధాటికి కొట్టుకుపోయాడు. ఇదంతా అక్కడ అందరూ చూస్తుండగానే జరిగిపోయింది.
Read Also: Man bit Snake: కాటేసిన పాము తల కొరికి నిద్రపోయిన మందు బాబు.. ఆ తర్వాత ఏం జరిగింటే?
కాపాడని స్థానికులు
కళ్ళ ముందే యువకుడు కొట్టుకు పోతుంటే…కాపాడే సాహసం కూడా చేయలేక పోయారు స్థానికులు. దీంతో యువకుడు గల్లంతై పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, నాచారానికి చెందిన దండు నరేశ్ (24) అనే యువకుడు బీబీనగర్ మండల పరిధిలో గూడూరు గ్రామ శివారులో ఉన్న చిన్నేటి వాగును దాటే ప్రయత్నం చేశాడు. వరద ఎక్కువవడంతో నీళ్లలో పడి వరదలో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలాన్ని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
Read Also: Bigg Boss: డీమాన్ కెప్టెన్ అయ్యాడు.. నా రీతూ నన్ను పట్టించుకోవట్లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ


