పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పండుగల జయశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు అధికారి చేవెళ్ల ఆర్డిఓ పి.సాయిరాం ఆధ్వర్యంలో పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ తట్టి అన్నారం వార్డు కార్యాలయంలో జరిగిన కౌన్సిలర్ల సమావేశంలో పండుగల జయశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి సమక్షంలో నూతన చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ లు గ్యారల శ్రీనివాస్ గౌడ్, మోతే మణెమ్మ, వడ్డేపల్లి విద్యావతి విజేందర్ రెడ్డి, పసుల రాజేందర్, దండెం కృష్ణారెడ్డి, చల్లూరి మురళీధర్ రెడ్డి, మల్రెడ్డి దీపిక, పబ్బతి లక్ష్మణ్, మద్ది నరేందర్ రెడ్డి, రోహిణి రెడ్డి, పాశం అర్చన దామోదర్, దేవుడి గీతా వేణుగోపాల్ రెడ్డి, కోటేశ్వరరావు, రమావత్ పరశురాం, జొరక గీత, ఓరుగంటి సుజాత, చెవుల హరిశంకర్, సిద్ధాంకి కృష్ణారెడ్డి, కందాడ అనుపమ, మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.