ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు అజయ్,రాకేష్, సాయి, రంజిత్ మాట్లాడుతూ విద్యరంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి ఏబీవీపీ ఉద్యమం చేస్తు ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యల పరిష్కారం మీద లేదని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విధ్వంసం అయినది ఏదైనా ఉన్నది అంటే కేవలం విద్యారంగం మాత్రమే అని అన్నారు.
విద్యను విధ్వంసం చేసి ఎన్నికలలో ఏ విధంగా గెలుస్తారని అని హెచ్చరించారు. పెండింగ్లో ఫీజు రీయింబర్స్మెంట్ 5300 కోట్ల బకాయిలు ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క విద్యార్థి అకౌంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలి అదేవిధంగా వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కు చట్టబద్ధత కల్పించి ప్రస్తుతం ఉన్న స్కాలర్షిప్లను ప్రతి నెల 2000 చొప్పున ఇవ్వాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలలో అధ్యాపక అధ్యపకేతర పోస్టులను భర్తీ చేయాలని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ అందించలేదని ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలని అదేవిధంగా ఖాళీగా ఉన్న 15000 పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 6000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం.
బి ఈ డి విద్యార్థులను అవమానించడం అనేది భాదాకరం అన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను డీఈవో పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని అన్నారు.ఖాళీగా ఉన్న 1.91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదలచేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు. పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ ప్రభుత్వమే భరించాలని అన్నారు, విద్యారంగా సమస్యల పైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ స్పందించి ఇప్పటికైనా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీపీపి డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమం కోసం విద్యార్థులు పెద్ద సంఖ్యలో మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు.
దీంతో విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు విద్యార్థి నాయకులను చెదరగొట్టి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు, ఏబీవీపీ నాయకులకు గాయలయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్లు రాజశేఖర్ నగర కార్యదర్శి పూసల విష్ణు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేషవేణి వేణు, మాధవేణి సునీల్, బామండ్ల నందు, కార్యకర్తలు ప్రమోద్, నాగరాజు, మధు ,సాయి కృష్ణ ,అభిషేక్ ఆశిష్ ,అరుణ్,అభి,కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.