బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా -ఈ రేసింగ్ కేసులో ఈనెల 6న ఉదయం 10గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు(TG Highcourt)తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అయితే దర్యాప్తునకు సహకరించాలని సూచించింది. దీంతో విచారణకు రావాలని అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు.
కాగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో కేసు నమోదుచేసిన ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది.