Sunday, December 8, 2024
HomeతెలంగాణAccident: హైదరాబాద్‌లో ట్రావెల్ బస్సు బీభత్సం

Accident: హైదరాబాద్‌లో ట్రావెల్ బస్సు బీభత్సం

Accident| హైదరాబాద్‌లో ఓ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఈఎస్‌ఐ(ESI) ఆసుపత్రి మెట్రో స్టేషన్ వద్ద గోటూర్ ట్రావెల్ బస్సు అతివేగంగా దూసుకొచ్చి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. అలాగే కారును కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కారు వెనుకభాగం నుజ్జునుజ్జు అయింది. అయితే వాహనదారులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు.

- Advertisement -

అనంతరం బస్సు డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్ బస్సుకు బ్రేక్స్ చెడిపోయాయా? లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా..? మద్యం సేవించి వాహనం నడిపాడా..? అనే దానిపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News