అచ్చంపేట నియోజకవర్గంలోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎంతో చరిత్ర ఉన్న రసూల్ చెరువును పరిరక్షిస్తూ పర్యాటక రంగంగా అభివృద్ధి పరచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు అన్నారు. అత్యంత పురాతనమైన చరిత్ర గల రసూల్ చెరువు మరమ్మతులకు కావలసిన వ్యయ ప్రణాళికలను వెంటనే రూపొందించి ప్రారంభించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులకు ఆదేశించారు.
బల్మూర్ మండలంలోని బిళ్ళకల్ గ్రామ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న రసూల్ చెరువును జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడిలతో కలిసి పరిశీలించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల రసూల్ చెరువు నిండుగా అధికమైన నీరు అలుగు ద్వారా పారుతుంది. చెరువు పరిసరాలను కలెక్టర్ ఎమ్మెల్యే పరిశీలించారు. మరమ్మతులు చెరువు చుట్టూ ట్రెక్కింగ్ ఏర్పాట్లకు కావలసిన వ్యయ ప్రణాళికను రూపొందించాలని ఇరిగేషన్ ఏఈ రమేష్ ను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు మరమ్మత్తులు కావలసిన ప్రణాళికలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ…
ఎంతో చరిత్ర గల రసూల్ చెరువును పరిరక్షిస్తూ పర్యాటక రంగంగా అభివృద్ధిపరిచేలా ప్రణాళికలు రూపొంది సంసిద్ధం చేయాలని, అందుకు అటవీశాఖ మంత్రిని చెరువు వద్దకు పిలిచి అనుమతి పొందేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో అటవీశాఖ అధికారులు పనులు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రసూల్ చెరువు అలుగు నుండి నీటి ప్రవాహం సాఫుగా ప్రవహించేలా చెత్తాచెదారాన్ని తొలగించేలా వెంటనే మనుషులతో తొలగించాలని అధికారులకు సూచించారు. దట్టమైన నల్లమల్ల ప్రాంతంలో పర్యాటక రంగంగా అభివృద్ధిపరిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎఫ్డిఓ తిరుమలరావు, డి.ఎస్.పి శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈ రమేష్, బల్మూరు తహసిల్దార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.