Sunday, November 16, 2025
HomeతెలంగాణACP Vishnu Murthy: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌కు మాస్...

ACP Vishnu Murthy: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ మృతి

ACP Vishnu Murthy Dies Of Heart Attack: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ సినిమా టాక్‌ కంటే వివాదంలోనే ఎక్కువగా వినిపించింది. ఈ సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌కు రావడం అక్కడ వేలాది ఫ్యాన్స్‌ తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ వార్త ఎతంటి సంచలనంగా మారిందో తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే. అయితే, ఈ కేసును టేకప్‌ చేసి అల్లు అర్జున్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లు డిపార్ట్‌మెంట్‌లో అనేక హోదాల్లో సేలవందించిన ఆయన ఆకస్మిక మరణం అందరినీ కలిచివేస్తోంది. నిరంతరం ప్రజా సేవ, ప్రజల భద్రతే ధ్యేయంగా, బాధితుల వైపు నిలబడిన ధీశాలిగా ఆయకు డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరుంది. దీంతో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏసీపీ విష్ణుమూర్తి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు నివాళులర్పిస్తున్నారు.

- Advertisement -

అల్లు అర్జున్‌కి మాస్ వార్నింగ్..

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ మరణించడం, మరో బాలుడు తీవ్రంగా గాయపడడ్డాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వెంటిలేటర్‌పై చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై సస్పెన్షన్‌లో ఉన్న ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వ్యాఖ్యలు, వైఖరిపై ఘాటుగా స్పందించారు. ‘‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఒక నిందితుడిగా ఉన్నాడు. కేసు కోర్టులో విచారణలో ఉండగా, ముద్దాయి అయిన వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టి తన తప్పేమీ లేదని ఎలా చెప్పగలడు?’’ అంటూ ప్రశ్నించారు.

బాధితుల వైపు నిలిచిన ధీశాలి..

అంతేకాకుండా, పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని అల్లు అర్జున్‌ను హెచ్చరించారు. ‘‘డబ్బు మదంతో బడాబాబులు మాట్లాడుతున్నారు. పోలీసులనే బద్నాం చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారు. పోలీసులంటే కనీస గౌరవం లేదా? మీ బౌన్సర్లను చూసుకుని ఓవరాక్షన్ చేస్తే అందరినీ లోపలేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకుంటే చట్ట ప్రకారం తోలు తీస్తాం’’ అని తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ‘‘పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి? నువ్వు ఏమన్నా తీస్‌మార్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు కేవలం ఓ సామాన్య పౌరుడివి. చట్టం ముందు అందరూ సమానమే. సినిమా హీరోలకి ప్రత్యేక చట్టాలేమీ ఉండవు’’ అని ఆయన నిలదీశారు. ఇక, ఈ వివాదంపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఏసీపీ విష్ణుమూర్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులు ప్రకటించడం గమనార్హం. అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోకి స్ట్రాంగ్‌ హీరోకి వార్నింగ్‌ ఇచ్చి బాధితుల వైపు నిలబడినందుకు అందరూ ఆయన్ను ప్రశంసించారు. ఆయన ధైర్యానికి మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad