Friday, September 20, 2024
HomeతెలంగాణIllegal ventures: అక్రమ వెంచర్ దారులపై చర్యలు తీసుకోవాలి

Illegal ventures: అక్రమ వెంచర్ దారులపై చర్యలు తీసుకోవాలి

లేకపోతే ఎర్రజెండాలు పాతి, పంచేస్తాం

అక్రమంగా ప్రభుత్వ గ్రామ కంఠం భూములను ఆక్రమించి అడ్డగోలు వెంచర్ల తో అమాయక ప్రజల్ని బలిచేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అక్రమ వెంచర్ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జంపాల వెంకన్న డిమాండ్ చేశారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం గ్రామ కంఠం భూములను అక్రమంగా ప్లాట్లు చేసిన అమ్ముతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వెంచర్ దారులపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని గ్రామ కంఠం భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. లేనియెడల ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి, నిరుపేద ప్రజలకు పంచుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సీనియర్ నాయకులు పోతుల నరసింహారావు పళ్ళా కోటి ధూపాటి జనార్దన్ మాగం లోకేష్ చిటాకుల రాములు మాగం రంగయ్య గుగులోత్ సక్రు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News