Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభMohan Babu: పరారీలో నటుడు మోహన్ బాబు

Mohan Babu: పరారీలో నటుడు మోహన్ బాబు

Mohan Babu| నటుడు మోహన్‌ బాబు పరారీలో ఉన్నారు. జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు ఆచూకీ లేకపోవడంతో ఇప్పటికే ఐదు చోట్ల గాలించారు. అయినా అచూకీ దొరకపోవడంతో మరికొన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

- Advertisement -

కాగా జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం విధితమే. ఈ కేసులో ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు వెళ్లగా ఆయన అచూకీ దొరకలేదు. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News