Saturday, November 23, 2024
HomeతెలంగాణAdditional collector: డెత్ రిపోర్ట్ ఉంటేనే ఓటును తొలగించాలి

Additional collector: డెత్ రిపోర్ట్ ఉంటేనే ఓటును తొలగించాలి

ఓటును తొలగించేందుకు మరణ ధ్రువీకరణ పత్రము తప్పని సరిగా ఉండాల్సిందేనని మహబూబాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ స్పష్టం చేశారు. ఐడిఓసిలోని కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై విచారణ చేపడుతున్న పలు అంశాలను సంబంధిత రెవెన్యూ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫారం 6 లో పెండింగ్ లో ఉన్న అంశాలను అధికారులతో సమీక్షించారు. తొలగింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ మరణ ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఆ ఓటర్ పేరును తొలగించవలసి ఉంటుందని తెలియ చెప్పారు. మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గం పరిశీలన చేయవలసిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచరాదని క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫారం 6 ,7 ,8 లలో తీసుకొని అబ్బాయే చర్యలను వివరించారు సాధ్యమైనంతవరకు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మహబూబాబాద్ తొర్రూరు ఆర్డీవోలు కొమరయ్య రమేష్ తాసిల్దార్లు ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News