వివోఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలంలో గత 14 రోజులుగా వివోఏ లు చేస్తున్న నిరవదిక సమ్మెలో పాల్గొన్న ఆది సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అనేక రకాలుగా పార్టీ కార్యక్రమాలకు వివోఏలను వాడుకొని ఇప్పుడు వారి కుటుంబాలను రోడ్డున పడేయడం చాలా బాధాకరం అన్నారు. వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారి న్యాయపరమైన డిమాండ్ లు నెరవేచ్చి 18, 000 కనీస జీతం ఇవ్వాలని ఆదిశ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ,కిషన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్, కార్యదర్శులు గోట్టే రుక్మిణి, కచ్చకాయల ఎల్లయ్య,తాళ్లపల్లి ప్రభాకర్, లింబయ్య, వంగపల్లి దేవరాజు, పెంతాల శ్రీనివాస్, నాగండ్ల భూమేష్, రాస రవీందర్ రెడ్డి,రవి, శంకర్, మధు, శివ,హరీష్ తదితరులు పాల్గొన్నారు.