Friday, April 4, 2025
HomeతెలంగాణTelangana: ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు

Telangana: ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు

ఇందిరా మహిళా శక్తి భవనాల(Indira Mahila Shakti Bhavan) నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాల‌ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఈ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఈ ఇందిరా మహిళా శక్తి భవన్‌ల‌లో శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్ వర్క్ షెడ్, ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, SARAS మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వ‌హ‌ణ‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే నవంబర్ 19వ తేదీన హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ స‌భ‌లో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాల‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేయనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఇక సీఎం చేతుల మీదుగా డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News