Saturday, July 12, 2025
HomeతెలంగాణGovernment Schools: ఫలిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి కృషి.. సర్కార్ బడుల్లో పెరిగిన అడ్మిషన్లు

Government Schools: ఫలిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి కృషి.. సర్కార్ బడుల్లో పెరిగిన అడ్మిషన్లు

Telangana Government Schools: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు మెల్లమెల్లగా ఫలితాలు ఇస్తున్నాయి. బడిబాట కార్యక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బడుల్లో పిల్లల ఆడ్మిషన్లు పెరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ సెక్రెటరీ యోగితా రాణా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బడిబాట కార్యక్రమంలో చురుగ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు.

ఇక ఆటోలు, రిక్షాల్లోనూ ప్రభుత్వం బడుల్లో సదుపాయాల గురించి జోరుగా ప్రచారం నిర్వహిచారు. పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు వారి పనులకు వెళ్లే ముందే టీచర్లు వారింటికీ వెళ్లి సర్కార్ బడుల్లో పిల్లలను చేర్పిచాలని కోరారు. పిల్లలను పనులకు పంపకుండా పాఠశాలలకు పంపించాలని సూచించారు. తల్లిదండ్రులు ఏ ఇబ్బంది లేకుండా బడులు తెరిచిన రోజునే కొత్త యూనిఫాంలు, పుస్తకాలు అందిస్తామని వివరించారు. అధికారులు, టీచర్లు కృషి మంచి సత్ఫలితాలు ఇచ్చింది.

దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏట అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మంది విద్యార్థులు సర్కార్ బడుల్లో అడ్మిషన్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల మంది కొత్త విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుంటారని.. కానీ ఈ ఏడాది మరిన్ని అడ్మిషన్లు పెరిగాయన్నారు. అలాగే వచ్చే సంవత్సరం మరింత మంది పిల్లలు ప్రభుత్వ బడిలో చేరేలా చర్యలు చేపడతామని తెలిపారు.

ప్రభుత్వం స్థానికంగా పనిచేస్తోన్న టీచర్లను సమీప బడులకు డిప్యూటేషన్‌పై పంపించింది. అంతేకాకుండా గ్రామ స్థాయి నేతల సహకారం తీసుకుని 140 స్కూళ్లను రీఓపెన్ చేయించడంతో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు పెరిగాయి. ఆయా పాఠశాలలకు కావాల్సిన మౌలిక వసతులు, మరమ్మత్తులు కోసం ఒక్కో బడికి రూ.2 లక్షలు కేటాయించింది. ఈ పనులను జిల్లా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది 118 మంది ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించడం విశేషం. మిగతా టీచర్లు సైతం తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా తెలంగాణలో మొత్తం 26,287 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రన్నింగ్‌లో ఉన్నాయి. కొన్నేళ్లుగా సుమారు 1,000 స్కూళ్లలో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. దీంతో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సమస్యలను పరిష్కరిస్తూ మూతబడిన పాఠశాలను రీఓపెన్ చేయిస్తున్నారు. సర్కార్ బడుల్లో పిల్లల అడ్మిషన్లు పెరగడంపై మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News