Vaishali: ఆదిభట్ల డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించింది. ఆమె శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. నవీన్‌తో నాకు ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. ఆయనతో నాకు పెళ్లైందన్న మాటలు అవాస్తవం అన్నారు. నాపై చాలా ఘోరంగా దాడి చేశారు. హెల్ప్.. హెల్ప్ అని అరుస్తుంటే.. చాలా ఘోరంగా కొట్టారు. గోళ్లతో గిచ్చారు.. కొరికారంటూ వైశాలి కన్నీరుమున్నీరైంది. నా ఇంటికి పదుల సంఖ్యలో వచ్చి నన్ను బలవంతంగా కిడ్నాప్ చేశారు. నాకు ఇష్టం లేదని చెప్పినా నవీన్ రెడ్డితో పాటు పది మంది నన్ను పట్టుకొని ఘోరంగా కారులోపలికి తోసేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది.
కారులో నవీన్‌తో పాటు మరో ఆరుగురు ఉన్నారు. నాకు ఇష్టంలేదని చెబుతున్నా నన్ను నవీన్ చాలా ఘోరంగా ట్రీట్ చేశాడు. ఇక్కడ సైలెంట్ గా ఉంటేనే అక్కడ మీ నాన్నవాళ్లు సేఫ్‌గా ఉంటారు. నువ్వు చిరాకు చేస్తే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరించాడని వైశాలి కన్నీరుమున్నీరైంది. నన్ను నవీన్ ఘోరంగా ట్రీట్ చేశాడు. నవీన్ అంటే తనకు ఇష్టం లేదు. తమకు పెళ్లైందని అతను చెప్తుంది అబద్దం అని వైశాలి స్పష్టం చేశారు. పెళ్లయిందని చెప్తున్న రోజు నేను ఆర్మీ ఆస్పత్రిలో డెంటర్ ట్రిట్‌మెంట్ తీసుకుంటున్నానని వైశాలి తెలిపింది.
నవీన్ మాతో కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాడు. ప్రస్తుతం నా గాయాలకు చికిత్స తీసుకుంటున్నా అని వైశాలి తెలిపింది. నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పానని, కానీ నవీన్ మాత్రం.. నీ ఇష్టంతో నాకు పనిలేదు, నువ్వు ఇంకోవ్యక్తిని పెళ్లిచేసుకుంటే నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది అంటూ బెదిరించాడని, నా కెరీయర్‌ను నాశనం చేశాడంటూ వైశాలి కన్నీరుమున్నీరైంది.