తాండూర్ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ నందు విజ్ఞాన్ మేళా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా సైన్స్ ఫెయిర్ అధికారి విశ్వేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యార్థులకు చిన్ననాటి నుండి వివిధ అంశాలపై అవగాహన కల్పించిన ఎంతో ముఖ్యమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల సృజనాత్మక, జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థుల చేసిన ప్రదర్శన మరియు వకృత్వం చూపురులనును ఆకర్షించింది.
రెండు రోజులపాటు ఈ మేల జరుగుతుందని పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, డైరెక్టర్లు మోహన్ కృష్ణ గౌడ్ ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, రవికుమార్, శోభారాణి, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.