ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధనకై దశలవారి ఉద్యమ కార్యచరణలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేశ్ మాట్లాడుతూ… ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే జరపాలని, పండితుల, పిఇటిల ఉన్నతీకరణ చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న రెండు డిఏ లు, పిఆర్సీ ఎరియర్స్ బిల్లులు, జిపిఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐ ఋణాలు చెల్లించాలని, వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పిఆర్సి కమిటీ వేయాలని, 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలో అవకాశం కల్పించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల, గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ప్రతీ పాఠశాలలో పారిశుధ్య కార్మికులను నియమించాలని, పాఠశాలలకు ఉచిత విద్యుత్తును ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని, లేని యెడల ఆగస్టు 10న జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సయింపు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గని రవికుమార్, జిల్లా నాయకులు మందడి సత్తిరెడ్డి, బిల్లా రాజ్యలక్ష్మి, మండల నాయకులు నగేశ్, సందీప్, రాజ్ కుమార్, పివికె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Teachers problems: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించాలి
ఆగస్టు 10న జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ధర్నా