Thursday, September 19, 2024
HomeతెలంగాణAllapur PS: పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం

Allapur PS: పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవతో ఏర్పాటవుతున్న కొత్త పోలీస్ స్టేషన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ డివిజన్ పరిధిలోని అన్ని బస్తీ మరియు కాలనీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, మహిళా కార్యకర్తలతో, సమావేశం ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఇందులో భాగంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ పరిధిలో గతంలో దొంగతనాలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, చాలా ఉన్నందున ప్రజలకు ఏ సమస్య వచ్చినా డివిజన్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ మూడు పరిధిలలో రావటంతో ప్రజలకు చాలా సమస్యలు తలెత్తాయని, దీంతో పోలీస్ స్టేషన్ కొత్తది ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే సహాయ సహకారాలతో డివిజన్ కి పోలీస్ స్టేషన్ తెచ్చుకోగలిగాం అని ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ ప్రజలకు తెలియజేశారు. పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి అన్ని బస్తీ, కాలనీ వాసులు, కార్యకర్తలు, ప్రజలందరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని సబీహా పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News