Sunday, December 22, 2024
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్థం

Allu Arjun: అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్థం

హీరో అల్లు అర్జున్‌కు(Allu Arjun) వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం నుంచి విమర్శలు.. మరోవైపు విద్యార్థి సంఘాల నుంచి నిరసనలు. దీంతో బన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్థం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్(Baba Fasiuddin), తన అనుచరులతో కలిసి బన్నీ దిష్టి బొమ్మను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఫసీయుద్ధీన్ మాట్లాడుతూ డ్రామారావు కేటీఆర్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటిస్తున్నారని ఆరోపించారు. ప్రెస్ మీట్‌లో బన్నీ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందేనని విమర్శించారు. 20 ఏళ్లుగా కేటీఆర్ డైవర్షన్, కన్నింగ్ రాజకీయాలు తనకు తెలుసన్నారు. మృతిచెందిన కుటుంబానికి కాకుండా హీరోకు మద్ధతు తెలిపిన ఏకైక నాయకుడు కేటీఆర్ ఒక్కరే అని మండిపడ్డారు. కేటీఆర్‌ను నమ్ముకుంటే అల్లు అర్జున్ కుటుంబం రోడ్డున పడుతుందని హెచ్చరించారు.

మరోవైపు బన్నీ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించిన విషయం విధితమే. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. గేటు లోపలికి దూసుకెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. అనంతరం ఇంటి ముందు భైఠాయించి నిరసన చేపట్టారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News