Allu Arjun| నాంపల్లి కోర్టు(Nampally Court)లో మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్‌ను పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసులు కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బన్నీ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో 4 గంటలకు విచారణ జరగనుంది. అరెస్టు చేసిన విధానం, పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి తెలుపుతానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన విధానంపైనా విచారణ జరపుతామని తెలిపింది. హైకోర్టు తీర్పును బట్టి బన్నీ రిమాండ్ ఆధారపడి ఉంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో బన్నీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి(Chiranajeevi) దంపతులతో పాటు నాగబాబు చేరుకున్నారు. ఇంటి వద్ద నుంచే ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చిరంజీవి రావాలని భావించినా.. అభిమానులు భారీగా వచ్చే అవకాశం నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన బన్నీ ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ రద్దు చేసుకున్నారు.