Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

Allu Arjun: కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన బన్నీ సుమారు 20 నిమిషాల పాటు వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరోవైపు బన్నీ రాకతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అల్లు అర్జున్‌తో పాటు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు(Dil Raju) కూడా ఉన్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఇచ్చిన బెయిల్‌ షరతులు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. బాలుడి పరామర్శకు వస్తే కచ్చితంగా తమ సూచనలు పాటించాలన్నారు. లేదంటే అక్కడ ఏదైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత బన్నీనే వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చిన బన్నీ.. ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News