Allu Arjun: చంచల్ గూడ జైలు నుంచి ఆలస్యంగా విడుదల చేయడంపై అల్లు అర్జున్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవంగా శుక్రవారం రాత్రే బన్నీ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు సమర్పించిన హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు తప్పుల తడకగా ఉన్నాయంటూ జైలు అధికారులు తెలిపారు. స్పష్టమైన ఉత్తర్వులు అందించాలని కోరారు. దీంతో రాత్రి విడుదల కావాల్సిన బన్నీ.. ఇవాళ ఉదయం బయటకు వచ్చారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా.. జైలు నుంచి ఆలస్యంగా విడుదల చేయడంపై అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
కాగా హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. హైకోర్టు బెయిల్ కాపీలను బన్నీ తరపు న్యాయవాదులు జైలు సూపరింటెండెంట్‌కు అందించి రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడంతో అల్లు అర్జున్‌ను అధికారులు విడుదల చేశారు. దీంతో బన్నీ తన కారులో నేరుగా జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం తన ఇంటికి చేరుకున్నారు.