Saturday, November 23, 2024
HomeతెలంగాణAlternate cards to Voter ID: ఓట‌రు గుర్తింపు కార్డుకు ప్ర‌త్యామ్నాయ కార్డులు

Alternate cards to Voter ID: ఓట‌రు గుర్తింపు కార్డుకు ప్ర‌త్యామ్నాయ కార్డులు

వీటిలో ఏ కార్డుతోనైనా ఓటు వేయచ్చు

 రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ సందర్భంగా ఓట‌రు గుర్తింపు కార్డులేకున్నా ప్రత్యామ్నాయ గుర్తింపు డాక్యుమెంట్ల‌ను చూపించి ఓటు వేసే అవ‌కాశం భారత ఎన్నికల కమిషన్ కల్పించినట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కొత్త ఓట‌ర్ల‌కు ఎపిక్ కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఓటు వేయ‌డానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్థార‌ణ‌కు పంపిణీ చేసిన ఓట‌రు స్లిప్ లు చూపితే స‌రిపోదని, ఓట‌రు గుర్తింపు కార్డు చూపాలి లేదా అవిలేని యెడల వారు వారి గుర్తింపు నిర్థార‌ణ‌కు కింద తెలిపిన ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏదైనా ఒక‌ దానినిపోలింగ్ కేంద్రాలలో చూపించాలని జిల్లా ఎన్నిక‌ల అధికారి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. 

- Advertisement -

వాటి గుర్తింపు కార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1.  ఆధార్ కార్డు

2.  MNREGA జాబ్ కార్డు

  1. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీచేసిన ఫోటో తో కూడిన పాస్ బుక్
    ‌4. కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
  2. డ్రైవింగ్ లైసెన్స్

6.  పాన్ కార్డు

  1. RGI ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు
  2. ఇడియన్ పాస్ పోర్టు

9. ఫోటోతో కూడిన పింఛ‌న్‌ మంజూరు డాక్యుమెంట్ 

  1. ఫోటో తో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం/PSUs/Public Limited Companies ఉద్యోగ గుర్తింపు కార్డు

11. ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలు జారీచేసిన అధికార గుర్తింపు ప‌త్రం.

  1. దివ్యాంగుల గుర్తింపు కార్డు l ఏదైనా ఒక గుర్తింపు కార్డులను వెంట తీసుకొని ఓటు హక్కు వినియోగించు కావాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జి హెచ్ ఏం సి కమిషనర్ కోరారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News