Friday, January 24, 2025
HomeతెలంగాణDavos: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. అమెజాన్‌ భారీ పెట్టుబడి

Davos: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. అమెజాన్‌ భారీ పెట్టుబడి

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం దూసుకుపోతోంది. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతూ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం.. తాజాగా మరో దిగ్గజ సంస్థ అమెజాన్‌(Amazon)తో ఒప్పందం చేసుకుంది.

- Advertisement -

దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. చర్చల అనంతరం రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకుంది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది.

మరోవైపు ఇన్ఫోసిస్‌(Infosys) సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. రూ.750కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడితో కొత్తగా 17వేల ఉద్యోగాలు రానున్నాయి. ఇక విప్రో(Wipro) సంస్థ కూడా తన కంపెనీ విస్తరణకు ముందుకొచ్చింది. మొత్తంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో ప్రభుత్వం సఫలమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News