Sunday, November 16, 2025
HomeతెలంగాణBathukamma Festival: హైడ్రాతో పునరుజ్జీవం పోసుకున్న కుంట.. ఈసారి అక్కడే బతుకమ్మ వేడుకలు!

Bathukamma Festival: హైడ్రాతో పునరుజ్జీవం పోసుకున్న కుంట.. ఈసారి అక్కడే బతుకమ్మ వేడుకలు!

Bathukamma Kunta ready for celebrations: అంబర్‌పేటలోని పురాతనమైన బతుకమ్మకుంట ఈసారి బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. హైడ్రాతో పునర్నిర్మించిన ఈ కుంటను ఈ నెల 25న ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

- Advertisement -

అధికారుల సమీక్ష: ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం సాయంత్రం ఈ కుంటను సందర్శించారు. వేడుకల ఏర్పాట్లను సమీక్షించారు. వారికి హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తోడుగా ఉన్నారు.

బతుకమ్మకుంట చరిత్ర: గతంలో ఆక్రమణలకు గురై, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయిన బతుకమ్మకుంట ఇప్పుడు పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడిందని అధికారులు తెలిపారు. హైడ్రా సంస్థ ఈ కుంట పునరుద్ధరణలో ఎంతో కృషి చేసిందని మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ వీహెచ్ ప్రశంసించారు. ఒకప్పుడు చూడటానికి కూడా భయపడే విధంగా ఉన్న ఈ కుంట ఇప్పుడు సర్వాంగ సుందరంగా మారిందని అన్నారు. హైడ్రా కృషి నిజంగా అభినందనీయమని తెలిపారు. ఈసారి బతుకమ్మ ఉత్సవాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ఏర్పాట్లు చేయాలని వేం నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/moderate-rains-forecast-for-telangana-2/

గౌరీ దేవిని ఆరాధించడం: బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.
ఈ పండుగలో బతుకమ్మను గౌరీ దేవి రూపంగా భావిస్తారు. గౌరీ దేవికి పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే ఆమెను పువ్వులతో అలంకరించి పూజిస్తారని నమ్ముతారు. ఇది ఆమెకు కృతజ్ఞత తెలియజేసే ఒక మార్గం.

ప్రకృతి ఆరాధన: బతుకమ్మ పండుగ ప్రధానంగా ప్రకృతితో ముడిపడి ఉంది. ఈ సమయంలో వర్షాలు కురిసి చెరువులు నిండుతాయి. రకరకాల పువ్వులు వికసిస్తాయి. వీటిని ఉపయోగించి బతుకమ్మను తయారుచేస్తారు. ఇది ప్రకృతిలోని జీవశక్తిని ఆరాధించే పండుగ.

సామాజిక ఐక్యత: బతుకమ్మ పండుగ అనేది మహిళలందరినీ ఒక చోట చేర్చి.. కలిసి ఆడిపాడే ఒక సందర్భం. ఇది సామాజిక బంధాలను, ఐక్యతను పెంపొందిస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో మహిళలు ఒక దగ్గర కలిసి.. ఈ వేడుకలను జరుపుకునేవారు. ఇది వారి మధ్య బంధాలను బలోపేతం చేసేది.

పండుగ ఎలా జరుపుకుంటారు?: ఈ పండుగ తొమ్మిది రోజులపాటు జరుగుతుంది. ప్రతి రోజు ఒక రకమైన బతుకమ్మను తయారుచేస్తారు. మహిళలు పూలను ఒక వలయాకారంలో, గోపురం ఆకారంలో పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. దీని పైన పసుపుతో చేసిన గౌరీ దేవిని ఉంచి పూజిస్తారు. రాత్రి వేళల్లో మహిళలు కొత్త దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ.. చప్పట్లు కొడుతూ వలయాకారంలో నృత్యం చేస్తారు. ఈ పాటలు జీవితం, కుటుంబం, బతుకమ్మ గొప్పతనం గురించి ఉంటాయి. చివరి రోజున బతుకమ్మను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలోని నీటి వనరులలో నిమజ్జనం చేస్తారు. దీనివల్ల పువ్వులు నీటిలో కలిసి భూమికి తిరిగి పోషకాలను అందిస్తాయని నమ్ముతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad