శ్రీరామనవమి సందర్బంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్స్ లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులు మంగళవాయిద్యాలతో వెళ్ళి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం జెక్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సుందర్ నగర్ రెసిడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం లో మంత్రి దంపతులు, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముందుగా బన్సీలాల్ పేట డివిజన్ అరుణ్ జ్యోతి కాలనీలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో పాల్గొన్నారు. ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామీ ఆలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా రాంగోపాల్ పేట డివిజన్ లోని జివైఆర్ కాంపౌండ్లోని బజరంగ్ దేవాలయం, గైదన్ బాగ్ లోని దేవాలయంలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట డివిజన్ లోని పిజి రోడ్ లో గల కృష్ణా కాలనీలో స్తానికులు నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రత్యేక పూజల అనంతరం మంత్రిని పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసిన అనంతరం నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్, బన్సీలాల్ పేట కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, హేమలత లక్ష్మీపతి, రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, పద్మారావు నగర్ బీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు శ్రీహరి, సురేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.