Friday, September 20, 2024
HomeతెలంగాణAminpur: వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కు 6 లక్షల విరాళం

Aminpur: వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కు 6 లక్షల విరాళం

పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీలో శ్రీ సిద్ధి వినాయక వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న సామాజిక భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆరు లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నాయకులకు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు వడ్డెర సంగం సామాజిక భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. అన్ని కుల సంఘాలకు సైతం ఇప్పటికే స్థలాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశావని తెలిపారు. అతి త్వరలో వీటిని అందజేయున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, చంద్రశేఖర్, మల్లేష్, వడ్డెర సంఘం నాయకులు సాయిలు, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News