Wednesday, July 16, 2025
HomeతెలంగాణAmit Shah: పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అమిత్ షా

Amit Shah: పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అమిత్ షా

Turmeric Board office: నాలుగు దశాబ్దాల తెలంగాణ పసుపు రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. .

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. తన చేతుల మీదుగా పసుపు బోర్డును ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారని తెలిపారు. దీంతో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా చైర్మన్ గా తెలంగాణ వ్యక్తినే నియమించామని చెప్పారు.

ఇకపై పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని నగరంగా మారుతుందని తెలిపారు. ఎన్నికల్లో పసుపు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జాతీయ పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్‌ పసుపు పంట వెళ్తుందన్నారు. పసుపు ఒక దివ్య ఔషధమని.. యాంటీ బ్యాక్టీరియా, క్యాన్సర్ గా పనిచేస్తుందన్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ కల్పిస్తామన్నారు. భారత్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు మేలు చేసేలా కృషి చేస్తున్నాం అని అమిత్ షా వెల్లడించారు.

అంతకుముందు అహ్మదాబాద్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయన.. ప్రత్యేక హెలికాఫ్టర్ లో నిజామాబాద్ చేరుకున్నారు. అనంతరం పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా.. బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పసుపు సంబంధిత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్త, ఇతర అధికారులు పాల్గొన్నారు


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News