ఆమ్రపాలి ఐఏఎస్ గుర్తుందిగా. సెన్సేషనల్, డైనమిక్, ఇన్స్పైరింగ్, డేరింగ్ కలెక్టర్ గా పేరుగాంచారు. వయసు చిన్నదైనా కలెక్టర్ గా ఆమె తనదైన ముద్రను వేశారు. సిన్సియర్ ఏఐఎస్ లను వేళ్లపైన లెక్కించే ఈ రోజుల్లో ఆమ్రపాలి శెభాష్ అనిపించుకునేలా పనిచేసి, తన పనితీరుతో టాప్ ర్యాంక్ లో నిలిచేవారు. కానీ ఐపీఎస్ ను పెళ్లిచేసుకున్నాక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన ఆమ్రపాలి, ఐదేళ్ల తరువాత రాష్ట్ర సర్వీసులోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు.
ఈమేరకు సీఎం రేవంత్ కు రిపోర్ట్ చేసిన ఆమ్రపాలి అందరూ ఊహించినట్టే కీలకమైన, ప్రతిష్ఠాత్మకమైన పోస్ట్ లోకి వచ్చారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (HMDA) కమిషనర్ గా సీఎం రేవంత్ సర్కారు ఆమెను నియమించింది. దీంతో 5 ఏళ్ల తరువాత అందరూ ఆమ్రపాలిని గుర్తుచేసుకుంటున్నారు.
వరంగల్ కలెక్టర్ గా పనిచేసిన రోజుల్లో ఆమ్రపాలికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇది ఓ దశలో ఏ స్థాయికి పోయిందంటే ఏకంగా ఆమె విగ్రహాన్ని గణేష్ మండపంలో పెట్టేంత. నమ్మలేకపోతే ఈ కింది ఫోటోను చూడండి. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఆమ్రపాలి తన ఒళ్లో బాల గణేష్ ను పట్టుకున్నట్టున్న ఈ విగ్రహాన్ని వరంగల్ లో ప్రతిష్ఠించారు గతంలో.