AndeSri Funeral CM Revanth Participated: తెలంగాణ ప్రజానీకం అశ్రునయనాల మధ్య ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/andesri-final-journey-state-honors-telangana/
అంతిమయాత్ర సమయంలో అందెశ్రీ పాడెను మోసిన సీఎం రేవంత్ మోశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. వారికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.


