Saturday, November 23, 2024
HomeతెలంగాణAndole: ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికో?

Andole: ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికో?

ఉమ్మడి మెదక్ జిల్లాలో పేరుగాంచిన అతిపెద్ద నియోజకవర్గం ఆందోల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో చక్రం తిప్పుతుందని విశ్లేషకుల అంచనా. ఆ అంచనాలతోనే దామోదర రాజనర్సింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి డిప్యూటీ సీఎం గా పని చేశారు. సోలో అందగాడిగా పేరున బాబు మోహన్ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి కార్మిక శాఖ మాత్యులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఆందోల్ ఎమ్మెల్యేగా గెలుపొందింది ఇక్కడి నుండే. కొన్ని కారణాలవల్ల పార్టీకు దూరమై ఆయన స్థానంలో జర్నలిస్ట్ నాయకుడు చంటి క్రాంతి కిరణ్ బిఆర్ఎస్ తీర్థము పుచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది బాబు మోహన్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఆందోల్ మండలం వైస్ ఎంపీపీ గా ఖాదరాబాద్ రమేష్ పని చేశారు. తర్వాత చంటి క్రాంతి కిరణ్ ఎమ్మెల్యే కాగానే జడ్పిటిసి గా పోటీ చేసి జడ్పిటిసిగా గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర జడ్పిటిసి ఫోరం అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. అప్పటివరకు ఒకే పార్టీ, ఒకే మాట, ఒకే బాట గా ఉన్న ఖాదరాబాద్ రమేష్ వర్సెస్ చంటి క్రాంతి కిరణ్ గా విడిపోయింది. రాబోయే ఎన్నికలలో టికెట్ నాకే అంటూ ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రోజు ఒక గ్రామంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వారితోనే కలిసి ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు కేసీఆర్ చేస్తున్న పనుల గురించి వివరిస్తూ ప్రజలను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖదిరబాద్ రమేష్. దీంతో ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే రాకుండా ఒక జడ్పిటిసి పనిగట్టుకొని మరి గ్రామాలలోని వీధులలో సంచరిస్తూ నేనే కాబోయే ఎమ్మెల్యేను అని చెప్పుకోవడంతో టికెట్ నాకే వస్తుంది అని చెప్పడం కోసమేరుపుగా మారుతుంది. దీంతో గ్రామాలలో ఉన్న నాయకులు ఎవరికి ఓటు వేయాలి ఎవరి పక్షాన నిలబడాలి అన్నది ప్రశ్నర్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మీటింగులో గులాబీ దళపతి కేసీఆర్ అక్రమాలు అవినీతిలో ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ విషయం ప్రజల్లోకి చాలా క్షుణ్ణంగా వెళ్ళింది దీంతో రాబోయే ఎన్నికలలో క్రాంతి కిరణ్ కు టికెట్ వస్తుందా లేదా అన్నది ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం గులాబీ దళపతి చెప్పాలి. ఖాదీరాబాద్ రమేష్ ఎప్పటికప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హరీష్ రావుతో, గులాబీ దళపతి కుమారుడు కల్వకుంట్ల రామారావు ఐటీ శాఖ మాత్యులు తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సాంఘిక మాధ్యమాలలో వైరల్ గా చేస్తున్నాడు. ఇంత జరుగుతున్న అధికార పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కింద ఖదిరబాద్ రమేష్ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అసలు ఖాదీరాబాద్ రమేష్ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు అన్నది తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఆందోళన నియోజకవర్గంలో జరుగుతున్న గందరగోళాన్ని పసిగట్టి నివారణ చర్యలు చేపట్టకపోతే రాబోయే ఎన్నికలలో గెలుపు మాత్రం పక్క పార్టీకి కట్టబెట్టిన వారవుతారు అని స్థానికులు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News