Sunday, September 8, 2024
HomeతెలంగాణAndole: శంకర్ దాదా RMP

Andole: శంకర్ దాదా RMP

సంగారెడ్డి జిల్లాలో ఆర్.ఎం.పీ లే ఎంబిబిఎస్ లు అయిపోతున్నారు. తలనొప్పి ఉందంటే మోకాలికి మందు ఇచ్చి డాక్టర్ బాబుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మొత్తం ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుస్తూ ఉన్నారు.
జిల్లాలో పల్లె జనానికి ఎలాంటి జబ్బులు వచ్చిన ఆర్.ఎం.పీలే దిక్కు దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యుల కంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలు అందించే ఆర్.ఎం.పీలే నయం అనే దుస్థితికి వచ్చారు. వందలాది గ్రామాలలో ప్రజలు ఇప్పటికీ ఆర్.ఎం.పీల వైద్యంపైనే ఆధారపడుతున్నారంటే వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఊరికి ముగ్గురు ఆర్ఎంపీలు గ్రామీణ ప్రాంతాలలో వేలాది మంది ఆర్.ఎం.పీలు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వీరిలో కొందరు మాత్రం అనుభవం లేకపోయినా ఆర్.ఎం.పీలుగా చలామణి అవుతున్నారు. ఎం.బీ.బీ.ఎస్ వైద్యుల మాదిరిగా ఇష్టానుసారంగా మందులు రాస్తూ ఉన్నారు.

నిబంధనలకు చెల్లు చీటీ…
ఆర్.ఎం.పీలు నిబంధనకనుకూలంగా పనిచేయాల్సి ఉన్నప్పటికీ వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరికొందరు ఏకంగా డెలివరీలు చిన్నచిన్న ఆపరేషన్లు చేసి ప్రజలను పరేషాన్ చేస్తున్నారు. ఆర్ఎంపీలు వైద్య సేవలు అందించడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవేమీ పట్టనట్లుగా గ్రామాలలో క్లినిక్ ల పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది ఆర్ఎంపీల వల్ల ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు ఆర్ఎంపీల వళ్ల ప్రాణాలు పోయిన ఘటనలు మారుమూల పల్లెలో ఎక్కువగా జరుగుతున్న బాధితులు మాత్రం బయటపడడం లేదు. ఆర్ఎంపీలు ఇచ్చిన మందులకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన రోగులను గుర్తించలేక ప్రైవేట్ వైద్యశాలను బాధితులు ఆశ్రయిస్తున్నారు.

ఈ పాపం వైద్యులదే…
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 50 కి పైగా ప్రాథమిక వైద్య కేంద్రాలు ఉండగా సుమారు 20 కి పైగా వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య కేంద్రాలలో పనిచేస్తున్న 80 శాతం మంది పల్లెల్లో ఉండకుండా జిల్లా కేంద్రాలకే పరిమితమవుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని మర్చిపోయి ప్రైవేటు వైద్యశాలలు పెట్టి రోగుల నుండి జలగల రక్తం పిలుస్తున్నారు. ప్రాథమిక కేంద్రాలలో డాక్టర్ల సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్థానికంగా ఉండాలి కానీ ఎప్పుడో ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ తన సొంత దావకానాలో ప్రైవేటు డాక్టర్ గానే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరికొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఇక్కడ సరిపోను సౌకర్యాలు లేవు అంటూ తన సొంత దవఖానాకి రోగులను పంపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి విధులు నిర్వహించే డాక్టర్ అప్పుడప్పుడు దర్శనమిస్తూ వచ్చిన అరగంటకే భోజన సమయం అయిందంటూ రోగులను వైద్య చికిత్సలు చేయకుండానే వెళ్తున్నారు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనలో ఏ వైద్యులు కూడా లెక్కచేయకుండా విధుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పల్లె జనానికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News