Thursday, September 19, 2024
HomeతెలంగాణAndole: తెలుగుప్రభ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Andole: తెలుగుప్రభ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం కేంద్రమైన జోగిపేటలో స్థానిక గల కేంబ్రిడ్జ్ హై స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలుగు ప్రభ దినపత్రిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యంతో పాటు స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తెలుగు ప్రభ అందోల్ నియోజకవర్గ ఇంచార్జ్ శివకుమార్ మహిళలను శాలువాలతో సత్కరించారు.

- Advertisement -

పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే సృష్టి శ్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు సాంఘిక మాధ్యమాల్లో పెట్టడానికి కాదు స్త్రీ అంటే ఏమిటి, స్త్రీ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు మరియు మహిళలకు వివరించారు. తెలుగు ప్రభ తెలుగు దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మహిళలు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయురాలు సంధ్యారాణి, శశిరేఖ, విజయలక్ష్మి, భవాని, స్థానిక మాభూమి డిజిటలైజేషన్ ఆపరేటర్ మాధురి, వనిత పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News