ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, బీఆర్ఎస్ పార్టీతోనే మరింత అభివృద్ధి సాధ్యమని ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ రావు, కమ్మరి ఆంజనేయులు, దేవేందర్ గౌడ్, భద్రు నాయక్, శివ, శంకరయ్య తదితరులు వారి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.