Friday, September 20, 2024
HomeతెలంగాణAnjayya Yadav: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు

Anjayya Yadav: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్ కు రెండు కండ్లలాంటివని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ ఆధ్వర్యంలో చర్ల అంతిరెడ్డిగూడ, వెంకమ్మ గూడ, చేగూర్, బండోని గూడ, బుగ్గొని గూడ, నర్సప్ప గూడ గ్రామాలలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ కావాలని కోరుకున్నది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసమేనన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు అనేక సవాళ్లను అధిగమించి నేడు దేశంలో అనేక రంగాల్లో మన రాష్ట్రం అగ్రగామిగా కొనసాగుతున్నదని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, కొత్తూరు మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్, చేగూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ విఠల్,ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News